Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి
- January 31, 2026 / 09:09 PM ISTByPhani Kumar
ఈరోజుల్లో ఓ సినిమా రిలీజ్ డేట్ కోసం.. అప్డేట్ అంటూ సోషల్ మీడియాలో ఊరించి.. తర్వాత రిలీజ్ డేట్ పలానా రోజున ఓ ఈవెంట్ పెట్టి చెబుతాం అంటూ హడావిడి చేసే సినిమా యూనిట్లే ఎక్కువగా ఉన్నాయి. అలా అయితేనే సినిమా గురించి జనాలు బాగా మాట్లాడుకుంటారు అనేది మేకర్స్ నమ్మకం. అలాంటిది రాజమౌళి వంటి నెంబర్ 1 డైరెక్టర్ తన ‘వారణాసి'(Varanasi) సినిమా రిలీజ్ డేట్ ని చాలా సింపుల్ గా.. అదీ సడన్ గా సోషల్ మీడియాలో పెట్టేయడం.. మొత్తం టాలీవుడ్ నే షాక్ కి గురి చేసింది.
Varanasi
మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా టీం ప్రకటించింది. అయితే అనౌన్స్ చేసిన డేట్ కి ఈరోజుల్లో సినిమాలు రిలీజ్ చేయడం అనేది కూడా కష్టంగానే ఉంది. రాజమౌళి వంటి పెద్ద దర్శకుడి సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో గతంలో ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘వారణాసి’ 10 శాతం షూటింగ్ కోసమే ఏడాది పాటు కష్టపడ్డాడు రాజమౌళి. మరి మిగిలిన 90 శాతం ఏడాదిన్నరలో కంప్లీట్ అవుతుందా? అనేది కూడా అనుమానమే. అయితే ఇంత త్వరగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వెనుక ఓ కథ కూడా ఉంది. ఒకవేళ అంతా అనుకున్నట్టు ‘వారాణసి’ 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అయితే అది మొదటి భాగం అవుతుంది అనేది ఇన్సైడ్ టాక్.
అవును ‘వారణాసి’ కథ కూడా టైం ట్రావెల్ కథే. టైటిల్ గ్లిమ్ప్స్ తోనే ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. మరోపక్క ఈ సినిమా కోసం రూ.1000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఇండియన్ సినిమాల్లో మొట్టమొదటిసారి ఐమాక్స్ వెర్షన్ తో ‘వారణాసి’ రూపొందుతోంది. అందుకే 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయితే మొదటి భాగంగా రిలీజ్ చేసి.. నిర్మాతలను గట్టెక్కించాలి అనేది రాజమౌళి ఆలోచనగా తెలుస్తుంది.
ఇక రెండో భాగాన్ని 2029 లో విడుదల చేసే అవకాశం ఉందట. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో.













