Jai Bheem: స్టేట్ అవార్డుల్లో ‘జై భీమ్’ హవా.. ఏడేళ్లలో ఏ సినిమాకు అవార్డులు వచ్చాయంటే?
- January 30, 2026 / 03:29 PM ISTByFilmy Focus Desk
తెలుగు సినిమాలకు నంది అవార్డులు ఇవ్వడం లేదు అని మనం మాట్లాడుకుంటున్నాం కానీ.. ఇదే పరిస్థితి తమిళనాడులో కూడా ఉంది. ఎందుకంటే 2015 తర్వాత అక్కడ తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వలేదు. ఈ టాపిక్ ఎక్కడా ఎప్పుడూ వచ్చింది. ఇప్పుడు ఏమైందో ఏమో ఒక్కసారిగా ఆరేళ్లకు సంబంధించిన స్టేట్ పిల్మ్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. 2016 నుండి 2022 వరకు విడుదలైన తమిళ సినిమాలకు అవార్డులు ప్రకటించారు. సూర్య ‘జై భీమ్’ సినిమా ఏడు విభాగాల్లో అవార్డులు రావడం విశేషం.
Jai Bheem
2021లో విడుదలైన ‘జై భీమ్’ సినిమాకు ఆ ఏడాదిలో ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటి, విలన్, సహాయ నటుడు, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు విభాగాల్లో అవార్డులు ప్రకటించారు. ఫిబ్రవరి 13న ఈ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. 2016లో ఉత్తమ చిత్రం: మానగరం, ఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి, ఉత్తమ నటి: కీర్తి సురేశ్. 2017లో ఉత్తమ చిత్రం: ఆరం, ఉత్తమ నటుడు: కార్తి, ఉత్తమ నటి: నయనతార.

2018లో ఉత్తమ చిత్రం: పరియేరుమ్ పెరుమాళ్, ఉత్తమ నటుడు : ధనుష్, ఉత్తమ నటి: జ్యోతిక. 2019లో ఉత్తమ చిత్రం : అసురన్, ఉత్తమ నటుడు: ఆర్.పార్తిబన్, ఉత్తమ నటి: ముంజు వారియర్. 2020లో ఉత్తమ చిత్రం : కూళంగల్, ఉత్తమ నటుడు: సూర్య, ఉత్తమ నటి: అపర్ణా బాలమురళి. 2021లో ఉత్తమ చిత్రం: జై భీమ్, ఉత్తమ నటుడు: ఆర్య, ఉత్తమ నటి: లిజోమోల్ జోస్. 2022లో ఉత్తమ చిత్రం: గార్గి, ఉత్తమ నటుడు: విక్రమ్ ప్రభు, ఉత్తమ నటి: సాయి పల్లవి.
సినిమాలతోపాటు టీవీ సీరిళయలకు కూడా అవార్డులను ప్రకటించారు. 2014 నుంచి 2022 టీవీ సీరియళ్లకు అవార్డులు ఇచ్చారు. అళగి, రోమాపురి పాండ్యన్, రామానుజర్, నందిని, సెంబురాతి, ఎతిర్ నీలాచల్, రాస్తి, పూవే పూచుదావా సీరియళ్లకు పురస్కారాలు ప్రకటించారు. రాధిక శరత్‌కుమార్, వాని భోజన్, నీలిమా రాణి, సంఘ్వి, రేవతి, రేష్మ, షబ్నా సాజన్, గాబ్రియెల్లా, చైత్ర ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.











