Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్.. వెంకటేశ్ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?
- January 31, 2026 / 02:53 PM ISTByFilmy Focus Desk
ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. రచయితగా వెంకటేశ్‌కు మంచి విజయాలు అందించిన త్రివిక్రమ్ దర్శకుడిగా మారాక ఇప్పటివరకు సినిమాలు చేయలేదు. ఇన్నాళ్లకు ‘ఆదర్శ కుటుంబం’ (ఏకే 47) అనే సినిమా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్, ఆ తర్వాత సినిమా స్టార్టింగ్ అనౌన్స్‌మెంట్ అంటూ సందడిగా సాగిన ఈ ప్రాజెక్ట్ ప్రయాణంలో ఇప్పుడు షూటింగ్ ప్రారంభం మరింత వేడుకగా ఉంది. అయితే ఈ సమయంలో రెండు విషయాలు వెంకటేశ్, త్రివిక్రమ్ అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Aadarsha Kutumbam
ఈ వేసవిని టార్గెట్ చేసుకుని ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఫ్యామిలీ డ్రామాకు, క్రైమ్ నేపథ్యం మిక్స్ చేసి ఈ కథను త్రివిక్రమ్ సిద్ధం చేశారని సమాచారం. గత కొన్ని రోజులుగా ఇదే మాట చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో సినిమా కోసం గతంలో మంచి విజయాలు అందుకు టెక్నీషియన్లను తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వారిలో మార్పులు జరుగుతున్నాయి అని సమాచారం. ఇప్పటికే తొలుత అనుకున్న కెమెరామన్ కాకుండా వేరే వారితో సినిమా చేస్తున్నారు అని సమాచారం వచ్చింది. ఇప్పుడు ఆర్ట్ డైరక్టర్‌ని మార్చారు అని చెబుతున్నారు.

తొలుత ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కోసం ‘లక్కీ భాస్కర్’ సినిమాకు పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ వినేశ్ బన్‌గ్లాన్‌ని తీసుకొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఓ పెద్ద సెట్ కూడా వేశారు. అయితే ఆ సెట్ విషయంలో త్రివిక్రమ్ నుండి ఆశించిన స్పందన రాలేదట. దీంతో అనుకున్న సమయానికి షూటింగ్ చేయకుండా.. మరో ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌ని పిలిపించి కొత్తగా సెట్ వేసి షూటింగ్ మొదలెట్టారట. ప్రస్తుతం ఆ పనులు వేగవంతంగా జరుగుతున్నాయట. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని ఇతర సీన్స్ తీసే పనిలో పడ్డారట సినిమా టీమ్.
శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడట. ఆయనకు సినిమాలో ఓ హీరోయిన్ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. ఇక ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇలా టీమ్ మారుతూ వెళ్తే అనుకున్న సమయానికి సినిమా వస్తుందా అనేది డౌట్.















