Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్
- January 31, 2026 / 07:30 PM ISTByPhani Kumar
ఈరోజు #SSR61 హ్యాష్ ట్యాగ్ తో ‘వైజయంతి మూవీస్’ సంస్థ ఓ ప్రాజెక్టుని అనౌన్స్ చేస్తున్నట్టు ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియా మొత్తం ఇదే టాపిక్ అయ్యింది. SSR- అనగానే అందరూ SS Rajamouli అనుకోవడం సహజం. అలా అనుకున్న వారు కొంత కన్ఫ్యూజన్ కి కూడా గురయ్యారు. ఎందుకంటే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నారు కాబట్టి..!
Singeetam Srinivasa Rao
అలా కన్ఫ్యూజ్ అవుతున్న వారిని డైలమాలో పెట్టకుండా వెంటనే అది Singeetam Srinivasa Rao 61వ సినిమా అని వెంటనే క్లారిటీ ఇచ్చేసింది వైజయంతి సంస్థ.అవును వైజయంతి బ్యానర్లో సింగీతం శ్రీనివాసరావు కెరీర్లో 61వ సినిమా రూపొందుతోంది. వినడానికి ఎంత విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. సింగీతం వయసు ప్రస్తుతం 94 ఏళ్ళు. ఈ వయసులో ఎవ్వరైనా రిటైర్మెంట్ లైఫ్ ని ఆస్వాదించాలి అనుకుంటారు.

కానీ ‘నాకు అసలు రిటైర్‌మెంటే లేదు’ అంటూ తాను హుషారుగా పనిచేస్తున్న వీడియోని వదిలారు నిర్మాతలు. ఇందులో సింగీతం డైరెక్షన్ చేయడం చూస్తుంటే.. చాలా మంది ఈయన్ని చూసి నేర్చుకోవాలి అనడం కూడా సహజం. సెట్స్ లో ఆయన చేస్తున్న అల్లరి. దేవి శ్రీ ప్రసాద్ వంటి ఇప్పటి స్టార్స్ కు ఆయన ఇస్తున్న గైడన్స్ చూడముచ్చటగా ఉంది. ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
94 ఏళ్ళ వయసు కలిగిన ఓ దర్శకుడికి అవకాశం ఇవ్వడం కూడా నిర్మాతలైన అశ్వినీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్..ల గొప్పతనం అనడంలో సందేహం లేదు.
థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’
A visionary. A master.
A genius ahead of time.The legendary Director #SingeetamSrinivasaRao garu returns with his most ambitious project yet.#SSR61 – Title Announcement Soon.https://t.co/SA22M5fcyx@nagashwin7 @ThisIsDSP @VyjayanthiFilms @SwapnaCinema pic.twitter.com/aX5Qi7X56i
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 31, 2026














