టాలీవుడ్ పై బాలీవుడ్ దండయాత్ర మొదలవుతుందా?

కొన్నేళ్ల క్రితం వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కేది కాదు. చాలామంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేక ఆ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కొంతమంది టాలీవుడ్ హీరోల సినిమాలు బాలీవుడ్ లో హిట్టైనా అక్కడ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంలో హీరోలు ఫెయిలయ్యారు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగ సినిమా హిందీలో మక్కీ పేరుతో విడుదలై అక్కడ ఫ్లాప్ అయింది.

Click Here To Watch

అయితే రాజమౌళి బాహుబలి సిరీస్ సినిమాలతో లెక్కలు మార్చారు. బాహుబలి ది బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తే బాహుబలి ది కంక్లూజన్ ఏకంగా 1700 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ హిందీలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. మరో సౌత్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్1 బాలీవుడ్ లో అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుంది.

అయితే బాలీవుడ్ స్టార్స్ కూడా టాలీవుడ్, ఇతర సౌత్ ఇండస్ట్రీలపై దృష్టి పెడుతున్నారు. సౌత్ ఇండియాలో సత్తా చాటాలని బాలీవుడ్ స్టార్స్ అనుకుంటున్నారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ ఇప్పటికే సౌత్ లాంగ్వేజెస్ లో తమ సినిమాలను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బాలీవుడ్ ప్రేక్షకులు మన సినిమాలను ఆదరిస్తున్నా ఇక్కడి ప్రేక్షకులు అక్కడి సినిమాలను ఆదరించడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో బాలీవుడ్ స్టార్స్ ఎవరైనా దక్షిణాది భాషల్లో సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.

మరోవైపు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ పుష్ప ది రూల్, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలు బాలీవుడ్ లో అంచనాలకు మించి కలెక్షన్లను సాధిస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఒడొదొడుకులు ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్ సినిమాలు ఇక్కడ ఏ మేరకు ప్రభావం చూపి కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాలి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus