సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో తాజాగా బాంబు ఉందంటూ ఓ ఆకతాయి చెన్నై పోలీసులకు ఫోన్ చేసి వారిని పరుగులు పెట్టించడం.. పెద్ద దుమారాన్నే రేపిందని చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం నాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి రజనీకాంత్ ఇంట్లో బాంబు ఉందని చెప్పాడు. పోలీసులు అతన్ని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే ఆ ఫోన్ కట్ చేసాడు.దీంతో వాళ్ళు కంగారు పడి.. గ్రీమ్స్ రోడ్డులో ఉన్న రజనీ ఇంటికి వెళ్ళారు.
అక్కడ ఉన్న పరిసరాలను స్నిపర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్ల సాయంతో తనిఖీ చేశారు. బాంబు స్క్వాడ్‌ను కూడా రజినీ ఇంటికి తీసుకువచ్చి తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ ఎటువంటి బాంబ్ లేదు.. దీంతో రిలాక్స్ అయినా.. ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేక మళ్ళీ తనికీలు చేసారు. అప్పటికీ వారు ఎటువంటి పేలుడు పదార్ధాలను కనుగొనలేకపోయారు. దీంతో రజినీ ఇంట్లో బాంబ్ ఉంది అని వచ్చిన కాల్.. ప్రాంక్ కాల్ అని వారు నిర్ధారించారు.
గతంలో కూడా రజనీ గురించి ఇలాంటి ప్రాంక్ కాల్స్ చాలా వచ్చాయట. అప్పుడు కూడా పోలీసులు ఇలాగే పరుగులు పెట్టారట. అయితే కొంతమంది నెటిజన్లు ఈ విషయాన్ని ఆధారం చేసుకుని.. ‘సెలబ్రిటీల పట్ల వెంటనే రెస్పాండ్ అవుతున్న పోలీసులు.. సామాన్య ప్రజల విషయంలో ఇంతే వేగంగా రియాక్ట్ అవుతారా?’ అని వ్యంగ్యంగా రియాక్ట్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రజనీ… శివ డైరెక్షన్లో ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తున్నాడు.