Boss Party Song: ‘వాల్తేరు వీరయ్య’ లోని ‘బాస్ పార్టీ’ సాంగ్ ఎలా ఉందంటే..!

మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా.. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.. టైటిల్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అంచనాలు కూడా పెరిగాయి.. నిన్న ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బమ్ నుండి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇస్తూ.. ‘బాస్ పార్టీ’ ప్రోమో వదిలిన టీం.. రీసెంట్‌గా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ పాటకు దేవి శ్రీ ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు లిరిక్స్ రాశారు. నకాష్ అజీజ్, హరిప్రియలతో కలిసి డీఎస్పీ కూడా పాడారు. మాస్ బీట్‌తో సాగే సాంగ్ ‘బాస్ పార్టీ’ సాంగ్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఉంది.. లిరికల్ వీడియోలో చిరు గెటప్, స్టెప్స్ చూస్తే ‘ముఠామేస్త్రి’ లో మెగాస్టార్ గుర్తొస్తారు. తన స్టైల్ ఈజ్, గ్రేస్, ఎనర్జీతో కనిపించారు చిరు. ‘డీజే వీరయ్య’ అంటూ చిరు వాయిస్ వింటుంటే.. థియేటర్లలో ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్ హంగామా చేయడం ఖాయం అనిపిస్తుంది.

మంగళవారం ప్రోమో విని నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్లకి సరైన సమాధానం చెప్పేలా ఉంది ‘బాస్ పార్టీ’ సాంగ్.. ‘‘నా బోటే ఎక్కు.. డీజే నొక్కు.. బొంబాటు పార్టీ’’ అంటూ పార్టీలందు బాస్ పార్టీ వేరు అనేలా సాగిన సాంగ్‌లో లిరిక్స్ అలరించేలా ఉన్నాయి.. ఇలాంటి మాస్ అండ్ ఫాస్ట్ బీట్‌ సాంగ్స్ చిరుకి కొట్టినపిండి.. ‘బాస్ పార్టీ’ లో మెగాస్టార్ ఏ రేంజ్‌లో మెస్మరైజ్ చేసుంటారో అర్థం చేసుకోవచ్చు…

యంగ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ శేఖర్ మాస్టర్ ‘బాస్ పార్టీ’ కి స్టెప్స్ కంపోజ్ చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద చిరు స్టెప్పులు చూడాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ‘బాస్ పార్టీ’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ అయితే లూప్ మోడ్‌లో పెట్టేసుకుంటున్నారీ పాటని. 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus