Balakrishna,Prabhas: బాలయ్య, ప్రభాస్ సినిమాల పోటీ.. విజేత ఎవరంటే?

యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. స్టార్ హీరో బాలకృష్ణ అఖండ సక్సెస్ తో మార్కెట్ ను పెంచుకుని వీరసింహారెడ్డి సినిమాతో మార్కెట్ ను రెట్టింపు చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే బాలయ్య, ప్రభాస్ సినిమాలు నాలుగుసార్లు ఒకే సమయంలో థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ పోటీలో కొన్నిసార్లు ప్రభాస్ పైచేయి సాధిస్తే మరికొన్ని సార్లు బాలయ్య పైచేయి సాధించారు.

2004 సంవత్సరంలో సంక్రాంతి పండుగ కానుకగా ప్రభాస్ వర్షం, బాలయ్య లక్ష్మీ నరసింహ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. ఆ తర్వాత 2005 సంవత్సరంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి, బాలయ్య నటించిన అల్లరి పిడుగు సినిమాలు కొన్నిరోజుల గ్యాప్ లో రిలీజయ్యాయి. ఈ సినిమాలలో ఛత్రపతి సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. 2008 సంవత్సరంలో బుజ్జిగాడు,

పాండురంగడు సినిమాలు వారం రోజుల గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ కాగా ఈ రెండు సినిమాలు యావరేజ్ హిట్లుగా నిలిచాయి. 2010 సంవత్సరంలో డార్లింగ్, సింహా సినిమాలు 7 రోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాలలో డార్లింగ్ హిట్ గా నిలిస్తే సింహా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సమయంలో ఇద్దరు హీరోలకు సమానంగా సక్సెస్ లు దక్కాయి.

అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ద్వారా ప్రభాస్, బాలయ్య మధ్య స్నేహం బలపడింది. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతుండగా రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ దిశగా అడుగులు పడతాయేమో చూడాలి. బాలకృష్ణ ప్రభాస్ కాంబో ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus