2026 సమ్మర్ ఆరంభంలో ‘పెద్ది’ (Peddi) ‘ది పారడైజ్’ (The Paradise) సినిమాలు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసుకున్నాయి. రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్ అవుతున్నట్టు ప్రకటన రావడం చర్చనీయాంశం అయ్యింది. దీంతో ‘హిట్ 3’ ప్రమోషన్స్ లో నానికి (Nani) వీటి రిలీజ్..ల విషయంలో ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘ ‘ది పారడైజ్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మార్చి 26 కి కొనసాగింపుగా అంటే మార్చి 27న ‘పెద్ది’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
మరి సేమ్ డేట్ కి వస్తారా? లేక మళ్ళీ కూర్చుని మాట్లాడుకుని ఏమన్నా మార్చుకునే అవకాశం ఉందా?’ అంటూ యాంకర్ నానిని ప్రశ్నించారు. అందుకు నాని మాట్లాడుతూ.. ” ఇంకా అంతగా ఏమీ ఆలోచించలేదు. మేము ముందుగా ‘పారడైజ్’ రిలీజ్ ను మార్చి 26 అనే అనుకున్నాం. ‘పెద్ది’ కూడా షూటింగ్ దశలోనే ఉంది. మా సినిమా కూడా షూటింగ్ స్టార్ట్ చేస్తాం. 2 సినిమాల షూటింగ్లు కంప్లీట్ అయ్యి.. రెడీగా ఉన్నాయి అంటే అవి నిర్మాతలు తీసుకోవాల్సిన నిర్ణయాలు.
నేను ‘పారడైజ్’ కి నిర్మాతను కాదు కాబట్టి.. కచ్చితంగా ఒక ఆన్సర్ ఇవ్వలేను. ఒకవేళ అవే డేట్లకి 2 సినిమాలు వచ్చినా అవి మంచి విజయాలు అందుకోవాలని నేను కోరుకుంటున్నాను. మార్చి నెల ఎండింగ్ అనేది కూడా మరో సంక్రాంతి సీజన్లా మారిపోయింది. గత 2 ఏళ్లలో సమ్మర్ సీజన్లో సరైన సినిమా లేకపోవడం వల్ల బాక్సాఫీస్ డల్ అయ్యింది. వచ్చే ఏడాది ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అయితే బాక్సాఫీస్ కి మంచి ఊపొస్తుందేమో. అంతకంటే కావాల్సిందేముంది” అంటూ బదులిచ్చాడు.