హారర్ సినిమాలో బాక్సర్

నిజ జీవితంలో బాక్సర్ అయిన రితిక సింగ్ రీల్ లైఫ్ లోనూ బాక్సర్ గా మెప్పించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సుధా కొంగర తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ‘ఇరుది సుట్రు/ సాల ఖాడూస్’ తెరపైకి వచ్చిన ఈ భామ సినిమాలనే కెరీర్ గా మలుచుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే విజయ్ సేతుపతి హీరోగా ఓ తమిళ చిత్రంలో నటించిన రితిక వెంకటేశ్ ‘గురు’ సహా మరో హారర్ సినిమాలో నటిస్తోంది. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో పలువురు అగ్ర హీరోలతో సినిమాలు చేసిన సీనియర్ తమిళ దర్శకుడు వాసు ప్రస్తుతం ‘శివలింగ’ పేరుతో ఓ హారర్ సినిమా రూపొందిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన కన్నడ చిత్రం ‘శివలింగ’కు ఇది రీమేక్.

ఈ సినిమానికీ దర్శకుడు పి.వాసు కావడం గమనార్హం. వాసు తనయుడు శక్తివాసు, రాఘవ లారెన్స్, రితిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. డిసెంబర్ నెలలో పాటలు, జనవరిలో సినిమా విడుదల చెయ్యాలన్నది దర్శక నిర్మాతల ప్లాన్. ఈ సినిమా ‘చంద్రముఖి’లా మంచి సినిమా అవుతుందని వాసు విశ్వాసం వ్యక్తం చేశారు. తొలుత ఈ సినిమాని ‘చంద్రముఖి2’ అని ప్రచారం చేయదలచారు. అయితే ఇదే వాసు గారు అప్పట్లో వెంకీతో నాగవల్లి సినిమా చేసినపుడు సైతం ఆ ముచ్చటే చెప్పారు అంచేత టైటిల్ మారే అవకాశం వుంది. ఇక రితిక విషయానికొస్తే.. చంద్రముఖిలో జ్యోతికని మించిపోతుంది లారెన్స్ అంటున్నాడు. చూద్దాం బాక్సర్ ఏ స్థాయిలో భయపెడుతుందో..!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus