Boyapati Srinu: బోయపాటిపై బాలయ్య అసహనం.. కోప్పడ్డారా?

టాలీవుడ్‌లో బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ అంటే మాస్ ఆడియెన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సింహా(Simha) , లెజెండ్ (Legend) ‘అఖండ’ (Akhanda) వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన ఈ కాంబో, ఇప్పుడు అఖండ 2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, షూటింగ్ సమయంలో బాలయ్య, బోయపాటి మధ్య చిన్న ఘర్షణ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అఖండ 2 ప్రీ ప్రొడక్షన్ సమయంలోనే హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ని మళ్లీ తీసుకోవాలని బాలకృష్ణ కోరినట్లు టాక్.

Boyapati Srinu

కానీ, ప్రగ్యా తన రెమ్యూనరేషన్ గట్టిగా పెంచడంతో, బోయపాటి ఆమెను పక్కన పెట్టి, ఆమె క్యారెక్టర్ ను చనిపోయినట్లు కథలో మార్పులు చేశారట. మరో హీరో సంయుక్త మీనన్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ విషయం బాలయ్యకు ముందుగా తెలియకపోవడంతో, ఒక కీలక సీన్ షూట్ చేస్తున్నప్పుడు ప్రగ్యా ఫోటో లేకపోవడం ఆయనకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. సెట్‌లో ఆ సీన్ షూట్ అవుతున్నప్పుడు బాలయ్య, “చనిపోయిన మనిషి ఫోటో ఎక్కడ?” అని అడగడం, బోయపాటి సైలెంట్‌గా ఉండడం వల్ల పరిస్థితి కాస్త సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

చివరికి బాలయ్య సెట్ వర్కింగ్ టీమ్‌ను నిలదీయడంతో, ఆ ఫోటోను వెంటనే తెచ్చి సెట్‌లో ఉంచారని సమాచారం. ఈ ఘటనతో, బాలయ్య తీరుపై కొంతమంది ‘ఆసహనం’గా అనుకున్నప్పటికీ, బాలయ్య తన సినిమాలపై ఎంత ఫోకస్ పెట్టారో స్పష్టమవుతోంది. అంతేకాకుండా, సినిమాలో విలన్ పాత్ర కోసం సంజయ్ దత్‌ను (Sanjay Dutt) తీసుకోవాలని బోయపాటి ముందుగా ఆలోచించి, ఆ తర్వాత ఆ ఐడియా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, బాలయ్య ఈ నిర్ణయం ఎందుకు మార్చారని అడిగి, స్వయంగా సంజయ్ దత్‌కు ఫోన్ చేసి డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్నారట.

ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా, బాలయ్య సినిమాల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ఈ గాసిప్స్ చెబుతున్నాయి. మొత్తానికి, బాలయ్య – బోయపాటి మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా, సినిమాపై ఉన్న కట్టుదిట్టమైన డెడికేషన్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అఖండ 2 సెట్స్‌లో నిజంగా ఇలాంటి ఘర్షణలు జరిగాయా? లేదా సాధారణ వర్కింగ్ డిస్కషన్లని గాసిప్స్ గా మార్చారు? అనేది మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు తెలియదు.

హిందీలో మరో రీమేక్.. దిల్ రాజు మళ్లీ రిస్క్ చేస్తున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus