Boyapati Srinu: రామ్-బోయపాటి ల మూవీ గ్లింప్స్ లో ఇది గమనించారా?

‘అఖండ’ కి ముందు రాంచరణ్ తో ‘వినయ విధేయ రామ’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. అది అతని కెరీర్లోనే బిగ్ డిజాస్టర్ గా మిగిలింది. టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గరనుండి ఆ సినిమాకి బోయపాటి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా నిరాశపరచడంతో.. యంగ్ హీరోలు సైతం బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి భయపడ్డారు. అయితే బాలయ్యతో ‘అఖండ’ చేసి ఆ విమర్శలకు చెక్ పెట్టాడు బోయపాటి.

‘అఖండ’ విషయంలో (Boyapati Srinu) బోయపాటి శ్రీను ఎటువంటి హడావిడి చేయలేదు. మొత్తం ఆ సినిమా కంటెంట్ మాట్లాడింది అని చెప్పవచ్చు. బాలయ్య పుట్టినరోజుకి గ్లింప్స్ ను వదిలాడు కానీ.. టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు రామ్ తో చేస్తున్న సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడు బోయపాటి. ‘బోయపాటి -రాపో’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ గ్లింప్స్ ను రామ్ పుట్టినరోజు కానుకగా వదిలాడు బోయపాటి. ‘బోయపాటి -రాపో’ ఫస్ట్ థండర్ అంటూ వచ్చిన ఈ గ్లింప్స్.. మాస్ అభిమానులకు ముఖ్యంగా రామ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందనే చెప్పాలి.

ఈ టీజర్లో నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో రామ్ కనిపిస్తున్నాడు. “నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా… నీ గేటు దాటలేనన్నావ్ దాటా… నీ పవర్ దాటలేనన్నావ్ దాటా… ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్…” అనే డైలాగ్ హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ టీజర్లో హీరోయిన్ శ్రీలీల కూడా కనిపించింది.తమన్ సంగీత దర్శకుడు. అక్టోబర్ లో దసరా కానుకగా ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది ఈ మూవీ.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus