బోయపాటి సెంటిమెంట్ ని వదులుకోవడం లేదు

కొందరికి టైటిల్ విషయంలో.. మరికొందరికి కాంబినేషన్ విషయంలో .. ఇలా ఒక్కో దర్శకునికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీనుకి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదే ఆలయ ప్రాంతాల్లో భారీ ఫైట్ పెట్టడం. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామిని చూపిస్తే హిట్ గ్యారంటీ అని నమ్ముతారు. అందుకే తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందర్భంలో, సన్నివేశంలో లక్ష్మీనరసింహాస్వామి ప్రస్తావన ఉండేలా బోయపాటి చూసుకుంటున్నారు. సింహా, లెజెండ్‌ సినిమాల్లో టెంపుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఫైట్లు తీశారు. సరైనోడులోనూ టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌ ఫైట్ పెట్టారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలోనూ టెంపుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సన్నివేశాలు తీశారు.

నిన్న విశాఖలోని సింహాచలంలో గల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రామ్‌ చరణ్ దర్శనం కోసం వెళుతున్న సన్నివేశాలను, మాడవీధుల్లో పల్లకీసేవ సన్నివేశాలను, ఆనంతరం భక్తులకు ప్రసాదాలు పంచిపెడుతున్న సన్నివేశాలను బోయపాటి తెరకెక్కించారు. ఈ షూటింగ్ లో చరణ్‌తో పాటు స్నేహ, ఆర్యన్‌ రాజేశ్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus