వంద కోట్ల రూపాయాల బడ్జెట్‌తో సినిమా… ఈ మాట వినడానికి చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. అయితే అలాంటి సినిమా చేసి, అంతమేర వసూళ్లు వెనక్కి తెచ్చుకోవడం అంత ఈజీనా. కాదనే అంటుంటాయి టాలీవుడ్ వర్గాలు. చాలామంది మాస్ హీరోలు సైతం ఆ సైతం వసూళ్లు వెనక్కి తెచ్చుకోవడానికి ఇబ్బందిపడ్డారు. స్టార్ హీరోలకు మాత్రం సాధ్యమయ్యేలా ఉంది. అదీ కష్టమే. ఇలాంటి సమయంలో రామ్ తర్వాతి సినిమాకు రూ. 100 కోట్లు బడ్జెట్ అంటున్నారు.
రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ‘వారియర్’ అనే సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమారు రూ. 65 కోట్ల నుండి రూ.70 కోట్ల బడ్జెట్ కేటాయించారని చెబుతున్నారు. తొలుత తక్కువ అనుకున్నా, పోను పోను అది రూ. 70 కోట్లకు చేరిపోయిందని టాక్. దీంతో ఈ సినిమా అంత మొత్తంలో వెనక్కి తెస్తుందా? అనే డౌట్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అలాంటిది తర్వాతి సినిమాకు రూ. 100 కోట్లు అంటే ఆలోచించాలిగా.
రామ్ తర్వాతి సినిమా అంటే… బోయపాటి శ్రీనుదే. ఈ మధ్య అనౌన్స్ చేసిన ఈ సినిమాను త్వరలో ప్రారంభిస్తారట. ఆ సినిమాకే బడ్జెట్‌గా రూ. 100 కోట్లు అవుతుందని టాక్. అందులోనూ ఇది పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. ఆ లెక్కన రూ. 100 కోట్లు పెట్టినా వచ్చేస్తాయి అని చెబుతున్నారు. కానీ రామ్ ప్రస్తుత మార్కెట్ ఆ స్థాయిలో లేదని చెప్పాలి. మరోవైపు బోయపాటి – బాలయ్యకు మాత్రం ఇప్పటివరకు సరైన సింక్ కుదిరింది.
అలాంటి సమయంలో ఈ సినిమాకు వంద కోట్ల రూపాయలు పెట్టి తిరిగి రాకపోతే ఇబ్బంది పడాలి. అయితే రామ్‌కి అంత టాలెంట్ లేదా అంటే ఉందనే చెప్పాలి. కానీ ఇండస్ట్రీ ఇప్పుడు చిన్నపాటి లాస్‌లను కూడా భరించే స్థితిలో లేదు. కరోనా కారణంగా చితికిపోయిన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే తట్టుకుంటోంది. ఇంకా పూర్వ స్థితిలోకి రాలేదు. కాబట్టి రామ్ నువ్వే చూసుకోవాలి మరి.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!