Mokshagna: బోయపాటి వ్యాఖ్యలపై బాలయ్య బాబు రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఆ దర్శకుడు దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నారు. ఆ సినిమాకు ఈ నిర్మాత దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ ఇలా ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పటివరకు వినిపించిన వార్తలన్నీ కూడా రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇంతవరకు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీపై సరైన క్లారిటీ రాలేదు. అయితే మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇవ్వకపోవడానికి అతని శరీరంలోని కొన్ని మార్పులే అంటూ అనేక రకాలుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ పై ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. తాజాగా గోవాలో జరుగుతోన్న 53వ అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాల్లో

భాగంగా దర్శకుడు బోయపాటి మాటల్ని బట్టి నందమూరి వారసుడు ఎంట్రీపై కొంత వరకూ క్లారిటీ వచ్చింది. ఆ సమయంలో బాలకృష్ణ బోయపాటి పక్కనే కూర్చున్నారు. మోక్షజ్ఞని మీరే లాంచే చేస్తారా? అని ప్రశ్నించగా బోయపాటి ఆశాభావం వ్యక్తం చేసారు. కానీ మోక్షజ్ఞని సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఎలా లాంచ్ చేయాలన్నది నందమూరి కుటుంబానికి ఓ ప్లాన్ ఉంటుంది. అతనికి ఏ దర్శకుడు సెట్ అవుతాడు? అతని ఇమేజ్ కి..బాడీ లాంగ్వేజ్ కి ఎలాంటి కథ సెట్ అయితే అతనే లాంచ్ చేస్తాడు?

నేనే లాంచ్ చేస్తానని గ్యారెంటీగా చెప్పలేను.ఆ టైమ్ వచ్చినప్పుడు ఎంట్రీ అలా జరిగిపోతుంది. అంతా దైవేశ్చ ఆదేవుడి అనుగ్రహం లేనిదే ఏం జరగదు. ఆ సమయం రావాలి. అప్పటివరకూ మనమంతా వెయిట్ చేయాలి అంటూ మోక్షజ్ఞ ఎంట్రీ పై ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పుడు బాలయ్య చిన్నగా చిరునవ్వు నవ్వాడు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus