నిజజీవితంలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం (Brahmanandam) , రాజా గౌతమ్ (Raja Goutham) ..లు కలిసి నటించిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’(Brahma Anandam). అయితే ఈ సినిమాలో బ్రహ్మి తాతగా కనిపించడం విశేషంగా చెప్పుకోవాలి. నిఖిల్ ఆర్ వి ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై ‘మళ్ళీ రావా’ (Malli Raava) ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'(Agent Sai Srinivasa Athreya) ‘మసూద’ (Masooda) వంటి హిట్ సినిమాలు అందించిన రాహుల్ యాదవ్ నక్క (Rahul Yadav Nakka) నిర్మించారు. అయితే ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన బ్రహ్మ ఆనందం ఆడియన్స్ నుండి జస్ట్ యావరేజ్ టాక్ నే రాబట్టుకుంది.
అయితే ఓపెనింగ్స్ మాత్రం ఇంకా డిజప్పాయింట్ చేశాయి అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.25 cr (ప్రీమియర్స్ తో కలుపుకుని) |
సీడెడ్ | 0.09 cr |
ఆంధ్ర(టోటల్) | 0.20 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.54 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.10 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 0.64 cr |
‘బ్రహ్మ ఆనందం’ చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.0.64 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.06 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి రూ.6.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.