Brahmanandam: బ్రహ్మానందం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారా?

  • January 6, 2024 / 06:52 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బ్రహ్మానందం ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో నటించి తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం సినిమాలను కాస్త తగ్గించి తన సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక బ్రహ్మానందం ఖాళీ సమయంలో తనలో ఉన్నటువంటి కళను బయటపెడుతూ ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలని గీస్తూ వాటిని సెలబ్రిటీలకు కానుకగా పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన సినిమాలలోకి రాకముందు తెలుగు లెక్చరర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బ్రహ్మానందం తన ఆత్మ కథను ఒక పుస్తకంలో రాసి ఆ పుస్తకాన్ని చిరంజీవి చేత ఆవిష్కరింప చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ పుస్తకంలో బ్రహ్మానందం తనకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. తను చిన్నప్పటి నుంచి పడినటువంటి ఇబ్బందులు లెక్చరర్ గా పని చేయడం సినిమాలలోకి రావడం పెళ్లి, పిల్లలు వంటి విషయాలన్నింటిని కూడా ఇందులో తెలియచేశారు అయితే ఈయన పెళ్లి మాత్రం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. బ్రహ్మానందం కుటుంబంలో ఎవరు పెద్దగా చదువుకోలేదు ఈయనే ఎంతో కష్టపడి చదువుకొని లెక్చరర్ అయ్యారు. అయితే ఈయనకు సహాయం చేసినటువంటి ఒక మహిళ తనకు పెళ్లి సంబంధం తీసుకువచ్చింది.

అప్పటికే బ్రహ్మానందం కుటుంబ సభ్యులందరూ తనకు మంచి పెళ్లి చేయాలని ఆలోచించారట. చదువుకున్నాడు లెక్చరర్ కావడంతో కట్నం కానుకలు కూడా బాగా వస్తాయని తన తల్లిదండ్రులు భావించారని బ్రహ్మానందం తెలియజేశారు. కానీ తను చదువుకొని ఈ స్థాయిలో ఉండటానికి సాయమైనటువంటి ఆమె చెప్పిన సంబంధం చూసుకోవాలని ఇంట్లో వారికి ఈ విషయం చెప్పారట అయితే ఇద్దరిది ఇంటర్ క్యాస్ట్ కావడంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో గొడవ పడి నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటాను లేకపోతే పెళ్లి చేసుకోనని బ్రహ్మానందం చెప్పడంతో వీరిద్దరికీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెళ్లి చేశారని బ్రహ్మానందం తన పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus