చాలా గ్యాప్ తర్వాత కింగ్ నాగార్జున నటించిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ కీలకపాత్రల్లో నటించారు.. బాలీవుడ్ యంగ్ అండ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్ బీర్ కపూర్ జంటగా నటించగా అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది..
పాజిటివ్ టాక్ తో పాటు రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది. ‘బ్రహ్మాస్త్ర : పార్ట్ వన్ – శివ’ గా వచ్చిన ఈ ఫిలిం.. తర్వాత ఈ ఫ్రాంచైజీలో రాబోయే సినిమాల మీద అంచనాలు పెంచేసింది. హిందీతో పాటు డబ్ చేసిన ఇతర భాషల్లోనూ మంచి ఆదరణ పొందిందీ చిత్రం.. ఆడియన్స్ ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ పాపులర్ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది.
ఈమధ్య సూపర్ హిట్ సినిమాల స్ట్రీమింగ్ కోసం పలు ఓటీటీ సంస్థలు స్పెషల్ డేట్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాయి… అలాగే ‘బ్రహ్మాస్త్ర’ కోసం కూడా ఓ స్పెషల్ డేట్ ని కూడా లాక్ చేశారు.. దివాళీ కానుకగా అక్టోబర్ 23 నుండి ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి డిస్నీ వారు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.. ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత నాగ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ అయ్యింది.
నాగ్ పర్ఫార్మెన్స్, ప్రవీణ్ స్టైలిష్ మేకింగ్ కి మంచి అప్లాజ్ అయితే వచ్చింది కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.. తమిళ్ లో మంచి కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకుంది కానీ తెలుగులో ఆ మ్యాజిక్ రిపీట్ చెయ్యలేకపోయింది. దసరా తర్వాత దీపావళికి ‘బ్రహ్మాస్త్ర‘ ఓటీటీ రిలీజ్ తో ట్రీట్ ఇవ్వనున్నాడని నాగ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు..