Brahmāstra Movie: నాగ్ బ్రహ్మాస్త్ర మూవీ అలా ఉండబోతుందా?

గత కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటున్నాయనే సంగతి తెలిసిందే. ఆకట్టుకునే కథ, కథనాలు లేకపోవడం, రొటీన్ ఫార్ములాతో తెరకెక్కడం బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణమని చెప్పవచ్చు. సెప్టెంబర్ నెల 9వ తేదీన రణ్ బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. అయితే బ్రహ్మాస్త్ర సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్ అని అందరూ అనుకుంటున్న అలియా భట్ విలన్ అని అదే ఈ సినిమాలో ఊహించని ట్విస్ట్ గా ఉండనుందని బోగట్టా. రణ్ బీర్ శివ పాత్రలో అలియా భట్ ఇషా పాత్రలో నటించారు. అమితాబ్ అరవింద్ చతుర్వేది అనే పాత్రలో నాగ్ ఆర్కియాలజిస్ట్ గా కనిపించనున్నారు. ప్రముఖ నటి మౌని రాయ్ ఈ సినిమాలో దమయంతి అనే పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

శివ పాత్ర పోషిస్తున్న రణ్ బీర్ సహాయంతో ఆయుధాలను చేరుకోవాలనే లక్ష్యంతో అలియా భట్ పని చేస్తుందని ఆమె పాత్ర ప్రేక్షకుల ఊహలను భిన్నంగా ఉంటుందని సమాచారం అందుతోంది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే కూడా ఈ సినిమాలో కనిపిస్తారని సమాచారం. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారని సమాచారం అందుతోంది. భారీ బడ్జెట్ తో బ్రహ్మాస్త్ర సినిమా తెరకెక్కగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.

బ్రహ్మాస్త్ర సినిమా సక్సెస్ సాధించడం నాగార్జునకు కీలకమని చెప్పవచ్చు. తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా నాగార్జున సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని నాగార్జున అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు నాగ్ రేంజ్ పెరుగుతోంది. నాగార్జున నటించిన ది ఘోష్ట్ మూవీ అక్టోబర్ 5వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus