2022 బాలీవుడ్ కు ఏమాత్రం కలిసి రావడం లేదు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ ‘భూల్ బులాయ2’ ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాలు తప్ప మిగిలినవన్నీ నిరాశపరిచాయి. అక్కడ విజయకేతనం ఎగరేసిన సినిమాలు కూడా సౌత్ సినిమాలే ఎక్కువ ఉండడం గమనార్హం. ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్ 2’ ‘మేజర్’ ‘విక్రమ్’ ‘కార్తికేయ2’ వంటి చిత్రాలు అక్కడ మంచి విజయాన్ని సాధించాయి.ఇటీవల రిలీజ్ అయిన ‘లైగర్’, నిన్న రిలీజ్ అయిన ‘సీతా రామం’ చిత్రాలు కూడా మంచి టాక్ ను సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించే విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి.
అయితే అక్కడి స్టార్ హీరోల సినిమాలు అన్నీ చతికిల పడ్డాయి అన్న సంగతి తెలిసిందే. 5,6 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఆమిర్ ఖాన్ కూడా ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు. అయితే ఎట్టకేలకు బాలీవుడ్ కాస్త కోలుకున్నట్టే కనిపిస్తుంది. సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతున్న ‘బ్రహ్మాస్త్ర’ అడ్వాన్స్ బుకింగ్స్ తాజాగా ఓపెన్ అవ్వగా.. అవి పర్వాలేదు అనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి సంబంధించి 11,558 టికెట్లు బుక్ అయినట్లు తెలుస్తుంది.
నిజంగా ఇది శుభ పరిణామం అని చెప్పాలి.ఇంకా చాలా చోట్ల బుకింగ్స్ ఓపెన్ అవ్వాల్సి ఉంది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని రాజమౌళి సమర్పిస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. రణ్‌భీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.
అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ కూడా పాల్గొని చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర