ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “బ్రహ్మోత్సవం”. ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమా తోలు రోజు నుంచే బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా కాస్త బోరింగ్ గా ఉంది అన్న టాక్ రావడంతో ఈ సినిమాలో దాదాపుగా 15నుంచి 20నిమిషాల నిడివి తగ్గించి మరీ మరోసారి ప్రేక్షకులకు అందించినా ఉపయోగం లేకపోయింది. ప్రిన్స్ ఫ్‌గాత చిత్రం శ్రీమంతుడు భారీ హిట్ కావడంతో….రిలీజ్‌కు ముందు ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది..ఈ చిత్రం. అయితే ఆ లెక్కలు దాదాపుగా అక్కడితో ఆగిపోయి, విడుదల తరువాత తొలి 10 రోజుల్లో కేవలం 35 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమా బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే మరో రూ.4 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే బ్రహ్మోత్సవం రూ.40 కోట్ల షేర్ సాధిస్తేనే గొప్ప అంటున్నారు. దీంతో ఈ సినిమా కొన్న బయ్యర్లకు రూ.4 కోట్ల వరకు నష్టాలు తప్పేలా లేవు. నైజాం, సీడెడ్, ఓవర్సీస్ ఏరియాల్లో అమ్మిన రేటుకి సగం కూడా కలెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది బ్రహ్మోత్సవం సినిమా. ఇలా ఎక్కడ చూసినా డిజాస్టర్ అన్న పదంతోనే సినిమా కధ ముగిసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా….ఈ ప్రయత్నం విఫలం కావడంతో ఒక భాద్యత గల నిర్మాతగా…నష్టపోయిన బయ్యర్లకు అండగా ఉండేందుకు సిద్దం అయ్యాడు ప్రిన్స్.