టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన ప్రిన్స్ మహేష్ బాబు వార్సా హిట్స్ తో దూసుకుపోతున్నాడు…ప్రిన్స్ లాస్ట్ మూవీ శ్రీమంతుడు భారీ హిట్ కావడంతో ఇప్పుడు రాబోతున్న బ్రహ్మోత్సవం పై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇక ఇదే క్రమంలో ఈ సినిమాలు భారీగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న వివరాల ప్రకారం…బ్రహ్మోత్సవం సినిమా బిజినెస్ విషయంలో ట్రేడ్ పండితులు సైతం అవాక్కు అవుతున్నారు….
ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది దానికి కారణం ప్రిన్స్ గత చిత్రం శ్రీమంతుడు మహేష్ కేరీర్‌లోనే అత్యధికంగా రూ.160 కోట్ల గ్రాస్ వసూళ్లు, రూ.90 కోట్ల షేర్ రాబట్టడంతో బ్రహ్మోత్సవం రైట్స్‌కు అన్ని చోట్ల భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న ప్రిన్స్…సినిమాలకు ఓవర్సీస్‌లో పెద్ద అసెట్. అందుకోసమే బ్రహ్మోత్సవంకు నెలకొన్న డిమాండ్ దృష్ట్యా ఓ పంపిణీ సంస్థ రూ.13 కోట్లు చెల్లించి బ్రహ్మోత్సవం ఓవర్సీస్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. సినిమా రిసల్ట్ తో సంభంధం లేకుండా ప్రిన్స్ కు అక్కడ భారీ డిమాండ్ ఉంది…ఉదాహరణకి అక్కడ వన్ లాంటి ప్లాప్ మూవీ కూడా వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసిందంటే ఓవర్సీస్‌లో మహేష్ స్టామినా ఏంటో తెలుస్తోంది.
అందుకే ఇప్పుడు 13 కోట్లకు ఈ రైట్స్ అమ్ముడుపోయాయి. మరో పక్క ఇప్పటికీ బ్రహ్మోత్సవం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.70 కోట్లను దాటేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా…హీరోగానే కాకుండా నిర్మాతగానూ ప్రిన్స్ టాలీవుడ్ ను ఏలుతున్నాడు.