భుజానికి కెమెరాలు తగిలించుకొని,దొంగలు లాగ దొంగ చూపులు చూస్తూ,అనుమానాస్పద రీతిలో వ్యవహరిస్తే ఎవరికైనా అనుమానం కలగకమానదు.తాజాగా తిరుమల లో ఇదే జరిగింది.అసలే హై సెక్యూరిటీ ఏరియా,పోలిసుల నిఘా ఎక్కువ.ఇంకేముంది దెబ్బకి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు.రహస్యం గా స్వామి వారి గరుడ సేవను షూట్ చేస్తున్నట్లు పోలీసులు డిసైడ్ చేసారు.తీర వాళ్ళని ఎంక్వయిరీ చేస్తే, ‘బ్రహ్మోత్సవం’ సినిమా టీం అని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు.వివరాలలోకి వెళితే …….
‘బ్రహ్మోత్సవం’ సినిమా కోసం తామిద్దరం వీడియోలు తీస్తున్నామని వారు తెలిపారు.అనుమతి తీసుకున్నార అని పోలీసులు అడిగిన ప్రశ్నకు లేదని చెప్పడం తో అనుమతి లేకుండా స్వామి వారి సేవల్ని ఎలా చిత్రేకరిస్తారని పోలీసులు విచారిస్తున్నారు.అయిన అనుమతి తీసుకొంటే సరిపోయేదానికి ఈ వెధవ పనులు ఏంటి అని అందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న సంగతి పాతకులకు విదితమే.ఈ ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.