Bro Movie: ఓవర్సీస్ లో ప్రభంజనం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ టికెట్లు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈరోజే ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ ని జారీ చేసారు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ ఈ చిత్రానికే వచ్చింది.

ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. కేతిక శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో ఇంకా ప్రారంభం కాలేదు కానీ ఓవర్సీస్ లో మాత్రం ప్రారంభం అయ్యింది. అక్కడి ట్రెండ్ రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రాలకంటే కూడా అద్భుతంగా ఉన్నట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా లండన్ లో ఈ చిత్రం (Bro Movie) నాన్ రాజమౌళి రికార్డు వైపుగా అడుగులు వేస్తుంది. అక్కడ ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన నిమిషాల వ్యవధి లోనే హాట్ కేక్స్ లాగ అమ్ముడు అవుతున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం సినిమా ట్రైలర్ ని బట్టీ జరుగుతాయి. కానీ ఇక్కడ ట్రైలర్ ఇప్పటి వరకు విడుదల కాకపోయినా కేవలం పవన్ కళ్యాణ్ పేరు మీద , జీరో ప్రొమోషన్స్ తో కనీవినీ ఎరుగని రేంజ్ బుకింగ్స్ జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు లండన్ లో రెండు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోగా, ప్రీమియర్స్ ప్రారంభం అయ్యే సమయానికి పది వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతాయని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే నాన్ రాజమౌళి రికార్డు వచ్చినట్టే. అమెరికా లో కూడా ఈ చిత్రం ఇప్పటి వరకు 50 వేల డాలర్లను వసూలు చేసింది. ట్రైలర్ విడుదల ఐయ్యేలోపు లక్ష 50 వేల డాలర్లు దాటిపోతుందని అంచనా.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus