Bro Movie: పవన్- సాయి ధరమ్ తేజ్ ల సినిమా టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ అదుర్స్ అంతే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయిధ‌ర‌మ్ తేజ్‌కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. త‌మిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదాయ సీత‌మ్‌’ కి ఇది రీమేక్‌ కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి.. పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ ను ఎప్పుడో కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం టైటిల్ ను ఈరోజు సాయంత్రం 4 గంటల 14 నిమిషాలకు రివీల్ చేస్తున్నట్టు చిత్రబృందం ముందుగానే ప్రకటించింది.

వారు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ ఉన్న టైటిల్ పోస్టర్ తో పాటు ఓ మోషన్ పోస్టర్ ను కూడా వదిలారు. ఈ చిత్రానికి ‘బ్రో’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ‘కాలః త్రిగుణ సంశ్లేశం , కాలః గమన సంకాశం’ అంటూ సాగే ఓ శ్లోకంతో మోస్టర్ పోస్టర్ 1 నిమిషం 24 సెకన్ల నిడివితో ఉంది. ఈ అప్డేట్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి అనే చెప్పాలి.

అలాగే జూలై 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి చిత్ర బృందం గుర్తుచేసింది. మొదట ఈ చిత్రానికి ‘దేవుడే దిగి వ‌చ్చినా’, ‘దేవ‌ర‌’… వంటి టైటిల్స్ అనుకున్నారు. కానీ అవి ట్రెండీగా లేవు అనే ఉద్దేశంతో ‘బ్రో’ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ టైంకి రూపమంటూ ఉంటే ఎలా కనిపిస్తాడో అలా కనిపిస్తాడట. సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రని సాయి ధరమ్ తేజ్.. పాత్ర ‘బ్రో’ ‘బ్రో’ అని పిలుస్తుందట.

ఈ (Bro)  టైటిల్ ను ఫిక్స్ చేయడానికి అది కూడా ఓ కారణం అని చెప్పాలి. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘జీ స్టూడియోస్’ సంస్థల పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేని అందిస్తుండగా సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus