Buchi Babu, Allu Arjun: ‘ఉప్పెన’ దర్శకుడి కొత్త సినిమా తెలుగులోనే!

ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చాక, భారీ విజయం అందుకున్నాక ఆ దర్శకుడికి, హీరోలకు ఖాళీ ఉండదు అంటుంటారు. కానీ అలాంటి భారీ విజయాలు అందించినా… తర్వాతి సినిమా లెక్కతేలడానికి చాలా రోజలు పట్టేసిన వాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటివారిలో దర్శకులే ఎక్కువ అంటుంటారు. రీసెంట్‌ టైమ్స్‌లో ఇలా బంపర్‌ హిట్‌ ఇచ్చి… కొత్త సినిమా స్టార్ట్‌ చేయని దర్శకుడు అంటే బుచ్చిబాబు సానా అని చెప్పొచ్చు. ‘ఉప్పెన’ సినిమాతో గతేడాదికి అద్భుతమైన విజయం అందించిన ఆయన ఆ తర్వాత సినిమా ఇంకా అనౌన్స్‌ చేయలేదు.

ఎన్టీఆర్‌తో సినిమా అని, అది పెద్ద ప్రయోగమని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఆవేవీ వీలవ్వలేదు. దీంతో బుచ్చిబాబు తమిళ పరిశ్రమకు వెళ్తున్నాడని, అక్కడ ఓ కుర్ర హీరోకి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడని అన్నారు. కానీ అవి కూడా పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే బుచ్చిబాబు నెక్స్ట్‌ సినిమా మీద ఇప్పుడు కాస్త క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. అయితే ఈ సారి క్లారిటీ ఇచ్చింది ఎన్టీఆర్‌ కాదు, బుచ్చిబాబు కాదు. అల్లు అర్జున్‌ ఆ పని తీసుకున్నాడు.

అంటే బన్నీ తన నెక్స్ట్‌ సినిమా ప్రకటించాడు. దాంతో బుచ్చిబాబు సినిమాపై క్లారిటీ వచ్చినట్లయింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత బన్నీ – అట్లీ సినిమా ఉంటుందని టాక్‌. ఇటీవల కథ విన్న బన్నీ ఓకే చెప్పేశాట. అట్లీ కథను అల్లు అర్జున్‌ ఓకే చెప్పేస్తే… బుచ్చిబాబు సినిమాను ఎన్టీఆర్‌ ముందుకు తీసుకురావొచ్చు కాబట్టి. అవును కొరటాల శివ సినిమా తర్వాత తారక్ అట్లీ సినిమా చేస్తాడని ఆ మధ్య వార్తలొచ్చాయి.

ఇప్పుడు అట్లీ – బన్నీ కాంబో రెడీ కాబట్టి… తారక్‌ – బుచ్చిబాబు సెట్‌ అవుతుంది. ఇప్పటికే తారక్‌కు బుచ్చిబాబు ఓ కథ చెప్పాడని టాక్‌. స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజిలో రూపొందించాలని మైత్రీ మూవీ మేకర్స్‌ అనుకుంటోందట. మరి దీని గురించి వివరాలు ఎప్పుడు అఫీషియల్‌ చేస్తారో చూడాలి. ఈలోపు ఒకటిరెండు లీకులు వస్తాయి లెండి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus