అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. అయితే హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇతను చాలా టైం తీసుకున్నాడు. ‘ప్రేమ కథ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతను తర్వాత ‘యువకుడు’ వంటి యావరేజ్ సినిమాతో రెండు మూడేళ్లు గెంటాల్సి వచ్చింది. 2004 లో వచ్చిన ‘సత్యం’ తో మొదటి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సుమంత్. ఆ తర్వాత ‘గౌరి’ అనే సినిమా కూడా అతనికి విజయాన్ని అందించింది. ఇక ‘గోదావరి’ ‘గోల్కొండ హైస్కూల్’ వంటి డీసెంట్ హిట్లు తన ఖాతాలో ఉన్నప్పటికీ..
బాక్సాఫీస్ వద్ద అతనికి మార్కెట్ అయితే ఏర్పడలేదు. అందుకే హిట్ టాక్ తెచ్చుకున్న ‘మళ్ళీ రావా’ కూడా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ‘సీతా రామం’ ‘సార్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన అతను.. మళ్ళీ హీరోగా ‘వారాహి’ అనే సినిమా చేస్తున్నాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘రంగమార్తాండ’ ఫేమ్ మధు నిర్మిస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. ‘వారాహి’ చిత్రానికి ఏకంగా రూ.10 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందట. వాస్తవానికి సుమంత్ కి అంత మార్కెట్ లేదు. రూ.4 కోట్లు, రూ.5 కోట్లు మధ్య బడ్జెట్ ఉండాలి. అప్పుడే మార్కెటింగ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. కానీ ఈ సినిమాకు రూ.10 కోట్లు బడ్జెట్ పెట్టడం అంటే చిన్న విషయం కాదు.
అయినప్పటికీ (Sumanth) సుమంత్ మాత్రం.. ‘బిజినెస్ సంగతి నేను చూసుకుంటాను.. క్వాలిటీ విషయంలో రాజీ పడకండి’ అంటూ నిర్మాత పై ఇంకా భారం పెడుతున్నాడట. అయితే తన చెల్లెలు సుప్రియ తలుచుకుంటే.. సినిమాని మార్కెటింగ్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. సుమంత్ ధైర్యం అదే కావచ్చు.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!