Bullet Song: ఇది దేవి శ్రీ మార్క్ మాస్ బీట్..రామ్ స్టెప్పులు అదుర్స్..!

రామ్ పోతినేని హీరోగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘వారియర్. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుండీ కోలీవుడ్ స్టార్ శింబు అకా STR పాడిన మాస్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు.చెన్నైలోని ఫీనిక్స్ మాల్‌లో జరిగిన స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన ‘బుల్లెట్’ సాంగ్ ఆవిష్కరింపబడింది. ఈ పాట విషయానికి దేవి శ్రీ మార్క్ మాస్ బీట్ తో ఈ పాట సాగింది.

Click Here To Watch NOW

రామ్ ఎనర్జిటిక్ స్టెప్పులు, కృతి శెట్టి లుక్స్ ఆకట్టుకున్నాయి. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటని. శింబు, హరిప్రియ లు చాలా యాక్టివ్ గా శ్రోతల్ని అలరించే విధంగా ఈ ఆలపించారు. రామ్ పోతినేని, లింగుస్వామిలకి అలాగే దేవి శ్రీ ప్రసాద్‌లకు శింబు మంచి స్నేహితుడు కావడంతో ఈ మూవీలో పాట పాడటానికి వెంటనే అంగీకరించినట్లు తెలుస్తోంది.జులై 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్‌గా విడుదల కాబోతున్న ఈ మూవీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.

ఆది పినిశెట్టి ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్‌ అలాగే మరో లుక్ లో కనిపిస్తాడని వినికిడి.ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు సాంగ్ ప్రోమో ప్రేక్షకుల్ని అలరించాయి. ఆది పినిశెట్టి లుక్ కూడా విడుదల చేయగా దానికి కూడా మంచి స్పందన లభించింది.అక్షర గౌడ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.’శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus