‘గీతా ఆర్ట్స్’ అధినేత, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయినటువంటి అల్లు అరవింద్ (Allu Aravind) గారికి బన్నీ వాస్ (Bunny Vasu) అంటే చాలా నమ్మకం. అతని పెద్ద కొడుకు అల్లు బాబీ (Allu Bobby), చిన్న కొడుకు శిరీష్ (Allu Sirish)..ల కంటే కూడా బన్నీ వాస్ నే అరవింద్ ఎక్కువగా నమ్ముతారు. అందుకే అతని రెండో బ్యానర్ అయిన ‘జి ఎ 2 పిక్చర్స్’ కి బన్నీ వాస్ ను నిర్మాతగా చేశారు. అల్లు అరవింద్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆ బ్యానర్ లో సక్సెస్ ఫుల్ మూవీస్ తీస్తూ వస్తున్నాడు బన్నీ వాస్.
అయితే కొన్నాళ్లుగా బన్నీ వాస్ ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ నుండి బయటకు వచ్చేసి వేరే బ్యానర్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై బన్నీ వాస్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా రాంగ్ గా ప్రొజెక్టు అవుతుంది. విషయం ఏంటి అంటే… అల్లు అరవింద్ గారికి నచ్చకపోయినా. నాకు నచ్చే కొన్ని కథలు ఉంటాయి.
‘గీతా ఆర్ట్స్’ లో ఉన్నప్పుడు నేను అరవింద్ గారు వద్దు అంటే ఆ కథల్ని పక్కన పెట్టేస్తూ వచ్చాను. ఇక్కడ ఉండగా అలాంటివి చేయకూడదు అని డిసైడ్ అయ్యాను. అయితే అరవింద్ గారికి నచ్చకపోయినా.. నాకు నచ్చే కథల్ని పక్కన పెట్టడం ఎందుకు అని భావించి ఒక బ్యానర్ పెట్టాలని అని అనుకుంటున్నాను. అప్పుడు అరవింద్ గారికి నచ్చకపోయినా.. నాకు నచ్చే కథలు అందులో చేసుకునే ఆప్షన్ ఉంటుంది.
ఇదే విషయం అరవింద్ గారికి చెప్పాను. అందుకు ఆయన.. నీకు నచ్చితే చేసుకో, కానీ కథ అయితే ముందుగా నాకు చెప్పు అన్నారు. సో నేను ‘గీతా ఆర్ట్స్’ లో నుండి బయటకి వెళ్ళను. కానీ నాకు నచ్చే కొన్ని కథలు.. అరవింద్ గారికి నచ్చకపోతే అందులో చేసుకుంటాను అంతే..! ” అంటూ చెప్పుకొచ్చాడు.