అల్లు అరవింద్, బన్నీకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ గీతాఆర్ట్స్ సంస్థలో కీలకవ్యక్తిగా మారాడు బన్నీ వాసు. అలానే చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘చావు కబురు చల్లగా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాపై జరుగుతోన్న నెగెటివ్ ప్రచారంపై బన్నీ వాసు స్పందిస్తూ కావాలనే తమ సినిమాను టార్గెట్ చేశారంటూ కామెంట్స్ చేశారు. ‘చావు కబురు చల్లగా’ సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది.
ఇదంతా ఓ నిర్మాత, పీఆర్వో టీమ్ కావాలని చేస్తుందని బన్నీ వాసుకి తెలిసింది. ఓ సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే.. థియేటర్ కి వచ్చే జనాల సంఖ్య తగ్గిపోతుంది. ఈ సినిమాకి బదులు మరో సినిమాకి వెళ్లడానికి జనాలు ఆసక్తి చూపుతారు. కావాలనే కొంతమంది నిర్మాతలు తన సినిమాను టార్గెట్ చేసి.. ఇలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు బన్నీ వాసు. కోవిడ్ సమయంలో తమ సినిమాను ఓటీటీకి ఇవ్వమని చాలా ఆఫర్లు వచ్చాయని..
కానీ థియేటర్లో రిలీజ్ చేయాలని ఇన్నాళ్లు ఆగామని బన్నీ వాసు అన్నారు. సినిమా విడుదలైన తరువాత కూడా దాని రేంజ్ ని బట్టి నాలుగు వారాల వరకు ఆగాలా..? లేక ఆరు వారాలు ఆగాలా..? అనే విషయాన్ని నిర్ణయించుకుంటామని.. రెండు వారాలకే సినిమాను ఓటీటీకి ఇవ్వాలనే ఆలోచన మాకెప్పుడూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు బన్నీ వాసు. ఇది ఆరోగ్యకరమైన పోటీ కాదని హితవు పలికారు.
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!