మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. 4 రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. హైదరాబాద్ లో భోళా శంకర్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టేటస్ కనుక గమనిస్తే ఇంకా కోటి గ్రాస్ మార్క్ ని దాటలేకపోయింది.250 షోలకి గాను 90 షోలు మాత్రమే హౌస్ ఫుల్స్ పడినట్లు తెలుస్తుంది.
మరోపక్క రజినీకాంత్ నటించిన ‘జైలర్’ పరిస్థితి కూడా ఇంతే. ఆగస్టు 10 న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. మొదటి రోజు 391 షోలు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే 85 షోలు మాత్రమే హౌస్ ఫుల్ పడినట్టు సమాచారం. ఇక్కడ విడ్డూరం ఏంటంటే.. ఈ కొత్త సినిమాల కంటే కూడా రీ రిలీజ్ అవుతున్న ‘బిజినెస్ మెన్’ సినిమాకి మొదటి రోజు ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రీ రిలీజ్ అవుతుండటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
ఇప్పటివరకు హైదరాబాద్ లో 172 షోలు కన్ఫర్మ్ అవ్వగా అందులో 110 షోలు హౌస్ ఫుల్స్ పడటం గమనార్హం.ఆల్రెడీ ‘బిజినెస్ మెన్’ అడ్వాన్స్ బుకింగ్స్ కోటి గ్రాస్ మార్క్ ను దాటేశాయి. ఇక్కడ ఏ హీరో కూడా తక్కువ కాదు. కానీ సినిమా పై బజ్ లేకపోతే రీ రిలీజ్ అవుతున్న పాత బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా పైచేయి సాధిస్తాయి అని ‘బిజినెస్ మెన్’ (Businessman) నిరూపించినట్టు అయ్యింది.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!