సూపర్ స్టార్ మహేష్ బాబు 48 వ పుట్టినరోజు సందర్భంగా అతని కెరీర్లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఒకటైన ‘బిజినెస్ మెన్’ ను 4K కి డిజిటలైజ్ చేసి రీ రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు చాలానే ఉంటాయి.మహేష్ బాబు క్యారెక్టర్ ఈ సినిమాలో నెగిటివ్ గా ఉన్నప్పటికీ.. ఆ పాత్రతో పూరి చెప్పించిన డైలాగులు నాన్ స్టాప్ గా విజిల్స్ కొట్టించేలా ఉంటాయి.
అందుకే అభిమానుల కోసం ఏరి కోరి ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసింది మహేష్ టీం. అయితే కేవలం మహేష్ అభిమానులే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని ఎగబడి చూశారు. దీంతో రీ రిలీజ్ సినిమాల్లో ‘బిజినెస్ మెన్’ ఆల్ టైం రికార్డు కలెక్షన్లు సాధించింది. ఒకసారి వాటిని పరిశీలిస్తే :
నైజాం | 1.35 cr |
సీడెడ్ | 0.17 cr |
ఉత్తరాంధ్ర | 0.19 cr |
ఈస్ట్ | 0.16 cr |
వెస్ట్ | 0.09 cr |
గుంటూరు | 0.14 cr |
కృష్ణా | 0.12 cr |
నెల్లూరు | 0.03 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.25 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.35 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 2.60 cr (షేర్) |
‘బిజినెస్ మెన్'(4K) (Businessman) రీ రిలీజ్ లో మొదటి రోజు రూ.2.6 కోట్లు షేర్ ని కలెక్ట్ చేసింది. రీ రిలీజ్ సినిమాల్లో మొదటి రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించిన సినిమా ఇదే కావడం విశేషం .
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!