అక్కడ ఆ సమయంలో నాకు తెలియకుండానే ఏడ్చేసాను

  • November 20, 2018 / 10:23 AM IST

తెలుగు లో చాలా హిట్ సినిమాలకి రచయితగా పనిచేసిన వ్యక్తి బీవీఎస్ రవి. ఇలా పలు విజయవంతమైన సినిమాలకి పనిచేసి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించాడు. బీవీఎస్ రవి కి సినిమాల్లోకి రాకముందు చిన్నతనం నుండే మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో అభిమానం ఉండేదంటా. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఆయనతో కలసి మాట్లాడే అదృష్టం కూడా వచ్చిందని చెప్పాడు. ఇంకా ఒక ఇంటర్వూ లో అయన జీవితంలో జరిగిన ఒక మరచిపోలేని సంఘటన గురించి ఇలా వివరించారు.

మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తీసుకొని సినిమాల్లో రి ఎంట్రీ ఇస్తున్నారని తెలిసి చాలా ఆనందంతో చిరంజీవి గారి 150 వ సినిమా కోసం ఒక కథని సిద్ధం చేశాను, ఈ కథని ఒక సంవత్సరం పాటు కష్టపడి చిరంజీవి గారి కోసం రాసుకున్నాను. ఇలా రాసుకొని చిరంజీవి గారికి కథని వినిపించగా ఆయనకి ఎంతోగానో నచ్చింది కానీ ఒక్క శాతం కథలో ఏదో వెలితి కారణంగా ఆగిపోయింది. ఇలా జరిగినందుకు నాకు అసలు బాధ అనేది లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుండి నా అభిమాన హీరోని చూస్తే చాలు అనుకున్న కానీ ఆయనకి కథ చెప్పే అదృష్టం కూడా వచ్చిందని అక్కడే ఏడ్చేసాను అని ఒక ఇంటర్వూ లో చెప్పాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus