నితిన్,ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటించిన మూవీ ‘చెక్’. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల అయ్యింది. సినిమాకి మంచి టాకే వచ్చింది కానీ.. ఆ టైములో ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచడం వలన జనాలు థియేటర్లకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. మెల్ల మెల్లగా సినీ ఇండస్ట్రీ కోలుకుంటున్న టైములో అలా టికెట్ రేట్లు పెంచడం ప్రేక్షకులకు నచ్చలేదు. ‘చెక్’ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడానికి మొదటి కారణం ఇదే..!
ఇక మేకర్స్ సారైన విధంగా సినిమాని ప్రమోట్ చెయ్యకపోవడం మరో మైనస్. అయితే ఈ ‘చెక్’ కు ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) సంస్థ 6.2/10 రేటింగ్ ఇవ్వడంతో ప్రేక్షకుల ఫోకస్ ఈ చిత్రం పై పడింది. ఓటిటిలో అయినా సరే ఈ చిత్రాన్ని ఓసారి చూడాలని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో కూడా ‘చెక్’ ఓటిటి రిలీజ్ కోసం డిస్కషన్లు మొదలయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘చెక్’ చిత్రం సన్ నెక్స్ట్ ఓటిటిలో ఏప్రిల్ 23న విడుదల కాబోతుందట.
మరి ఇక్కడైనా ఈ సినిమా విజయం సాధిస్తుందో లేదో చూడాలి. ఈ మధ్య కాలంలో ఓటిటి లో విడుదలైన సినిమాలకు వింత స్పందన వస్తుంది. అదేంటంటే థియేటర్లలో హిట్ అయిన ‘ఉప్పెన’ ‘జాతి రత్నాలు’ సినిమాలు ప్లాప్ అన్నారు.. అయితే థియేటర్లలో ప్లాప్ అయిన ‘శ్రీకారం’ చిత్రాన్ని హిట్ అన్నారు. మరి ‘చెక్’ విషయంలో కూడా అలాంటి టాకే వినిపిస్తుందేమో చూడాలి..!