ఎన్టీఆర్ వల్ల అవుతుందా?

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హవా గురించి మనం పెద్దగా చెప్పనక్కర్లేదు. తన డ్యాన్స్, తన పర్ఫార్మెన్స్, తన డైలాగ్స్, యాక్షన్ అన్నీ కలగలిపి పోసిన హీరో ఎన్టీఆర్ ఒక్కడే అని చెబితే ఎవ్వరైనా ఒప్పుకోక తప్పని నిజం. ఇదిలా  ఉంటే ఎన్టీఆర్ యాక్టింగ్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ అని అందరికీ తెలిసిందే. అదే క్రమంలో ఆయన తెరపై విశ్వరూపం చూపించడం మొదలు పెడితే ఎలా ఉంటుంది తొలి రోజుల్లోనే చూశాం. అయితే మరో పక్క ఎన్టీఆర్ ఇప్పుడు రెండు హిట్స్ కొట్టి జనతా గ్యారేజ్ పేరుతో మూడో హిట్ కొట్టేందుకు సిద్దం అవుతున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా…అసలు చిక్కు ఎన్టీఆర్ కు ఇప్పుడు వచ్చింది…అదేమిటంటే మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో నటించడం…విషయంలోకి వెళితే…మోహన్ లాల్ టాప్ హీరో, అది దేశం మొత్తం ఒప్పుకుని తీరాల్సిందే.

అదే క్రమంలో తెరమీద మోహన్ లాల్ ఉంటే.. మిగతా నటులందరూ పక్కకు వెళ్లిపోవాల్సిందే. తన నటనతో అంతగా హైలైట్ అవుతాడు మోహన్ లాల్. అయితే అలాంటి టాప్ యాక్టర్ ముందు ఎన్టీఆర్ తనని తాను ఎలా ప్రూవ్ చేసుకుంటాడు? ఆయనకు ఎలాంటి పోటీ ఇస్తాడు.. నటనలో ఆయన ముందు తన ప్రత్యేకతను ఎలా చాటుకుంటాడు అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ట్రైలర్స్ ప్రకారం చూస్తుంటే ఈ సినిమాలో మోహన్ లాల్ ది చాలా బలమైన పాత్ర అవడంతో ఆ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఆ పాత్రలో మన సూపర్ స్టార్ ఎలా ఆదరగొట్టి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. మరి అలాంటి టాప్ స్టార్ ముందు ఎన్టీఆర్ తన ప్రత్యేకత ఎలా చాటుకుంటాడో చూడాలి మరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus