Prabhas: ప్రభాస్ బాహుబలి రేంజ్ హిట్ సాధిస్తారా..?

  • June 9, 2021 / 09:53 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉండటంతో పాటు ఇతర హీరోలతో, టాలీవుడ్ డైరెక్టర్లతో సన్నిహితంగా ఉంటారు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి విజయాలతో మార్కెట్ ను పెంచుకున్న ప్రభాస్ బాహుబలి సిరీస్ సినిమాల్లో నటించడంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. రాజమౌళి ప్రభాస్ కాంబో బాహుబలి సిరీస్ సినిమాలతో కొత్త రికార్డులు రికార్డులు క్రియేట్ చేయగా ఆ సినిమాలలో ప్రభాస్ నటనకు, రాజమౌళి డైరెక్షన్ కు ప్రశంసలు వచ్చాయి.

రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఆర్ఆర్ఆర్ తో సినిమాతో బాహుబలి రికార్డులు బ్రేక్ అవుతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభాస్ కూడా తన సినిమాతో భారీ కలెక్షన్లను సాధించి ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభాస్ గత సినిమా సాహో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కగా ఆ సినిమా నిర్మాతలకు భారీగా నష్టాలు వచ్చిన సంగతి తెలిసిందే. రాబోయే 18 నెలల్లో ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాలు రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ రిలీజ్ కానున్నాయి.

ఈ మూడు సినిమాలలో ఏ సినిమాతోనైనా ప్రభాస్ బాహుబలి 2 స్థాయిలో కలెక్షన్లు సాధిస్తారేమో చూడాల్సి ఉంది. అయితే ప్రభాస్ సినిమాలకు నార్త్ ఇండియా బిజినెస్ కూడా భారీగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచంలోకి తీసుకెళతానని ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus