నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రంలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకోబోతున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా విదేశాల్లో ఉంటుందని, ఇంటర్వెల్ బ్యాంగ్ టైంకి మెయిన్ రోల్ ఎంటరవుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ టీజర్ ను విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. టైటిల్ ను కూడా కర్నూల్ లోని ఫేమస్ ప్లేస్ అయిన కొండారెడ్డి బురుజు వద్ద రివీల్ చేయడంతో సినిమాకి భారీ హైప్ ఏర్పడింది.
మరోపక్క సినిమాకి బిజినెస్ ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయని తెలుస్తుంది. మరో రెండు వారాల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత గ్యాప్ లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ‘వీర సింహారెడ్డి’ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం..
ఈ చిత్రం బడ్జెట్ రూ.100 కోట్లు దాటేసిందట. బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన చిత్రంగా ఈ మూవీ నిలుస్తుందని తెలుస్తుంది. ‘అఖండ’ రిజల్ట్ తో మేకర్స్ బడ్జెట్ విషయంలో లిమిట్ పెట్టుకోకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాని తీర్చిదిద్దుతున్నట్టు టాక్. ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ రూ.80 కోట్ల వరకు జరుగుతుందట. నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారి నుండి మంచి ఆఫర్ అందినట్టు వినికిడి.
ఈ చిత్రంలో విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ నటించడంతో కన్నడ డబ్బింగ్ రైట్స్ కు కూడా మంచి రేటు పలికింది అని వినికిడి. ‘అఖండ’ ని నిర్మాతలు రూ.70 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’ కి రూ.100 కోట్లు అంటే.. బాలయ్య మార్కెట్ ఇంకో రూ.30 కోట్లు పెరిగిందన్న మాట.