మరికొద్ది గంటల్లో ‘భీష్మ’ విడుదల కాబోతుంది. ఈ చిత్రం విజయం సాధించడం.. అటు నితిన్ కు ఇటు దర్శకుడు వెంకీ కుడుములు చాలా అవసరం. నితిన్ కు పర్వాలేదు. ఇది కాకపోతే మరో 3 సినిమాలు ఆప్షన్ ఉంది. కానీ దర్శకుడు వెంకీ కుడుములు పరిస్థితి అలా కాదు. మొదటి చిత్రం ‘ఛలో’ తో డబుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఆ చిత్రం కొన్న ప్రతీ బయ్యర్ కు రూపాయికి రెండు రూపాయల లాభాల్ని.. అందించింది. దీంతో ‘భీష్మ’ చిత్రానికి ఏకంగా 25 కోట్ల బడ్జెట్ పెట్టేసారు నిర్మాతలు. డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ వారు సేఫ్ అయిపోవడమే కాదు లాభాల్ని కూడా అందుకున్నారు. కానీ రెండవ సినిమా థియేట్రికల్ గా సక్సెస్ అయితేనే వెంకీ కి పెద్ద ఆఫర్ అయినా మీడియం ఆఫర్ అయినా వస్తుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అసలే సెంటిమెంట్లు బాగా ఎక్కువ. మొదటి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకులకి రెండవ సినిమా హిట్టు కొట్టడానికి చాలా కష్టపడతారు. ఇప్పటికీ రెండవ సినిమాతో హిట్టందుకున్న దర్శకుల లిస్ట్ కూడా తక్కువే. రాజమౌళి, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, మారుతీ, శివ నిర్వాణ, మేర్లపాక గాంధీ, శ్రీకాంత్ అడ్డాల, కృష్ణవంశీ, గౌతమ్ తిన్ననూరి వంటి క్రేజీ డైరెక్టర్లు మాత్రమే ఉన్నారు. మరి ‘భీష్మ’ తో హిట్టు కొట్టి ఆ లిస్ట్ లో వెంకీ కూడా చేరుతాడా లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ హిట్టు కొడితే వరుసగా పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే కష్టమే. ఇక ‘భీష్మ’ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది కాబట్టి ‘భీష్మ’ పై పాజిటివ్ బజ్ ఉంది. మరేమవుతుందో చూద్దాం.