తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’ తమిళంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.ఈ మధ్య ధనుష్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి బాగా పెర్ఫార్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రఘువరన్’ ‘తిరు’ వంటి సినిమాలు బాగానే కలెక్ట్ చేయగా ‘సార్’ సినిమా అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ‘కెప్టెన్ మిల్లర్’ ని కూడా తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. మొదట సంక్రాంతి టైంలోనే రిలీజ్ చేయాలనుకున్నా..
థియేటర్స్ లేకపోవడంతో జనవరి 26న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, అలాగే టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కూడా నటించడం స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ చిత్రం తెలుగు హక్కులు ‘సత్య జ్యోతి ఫిలిమ్స్’ వారు తీసుకోగా ‘ఏషియన్ సినిమాస్’, ‘సురేష్ ప్రొడక్షన్స్’ ద్వారా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఒకసారి బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను గమనిస్తే :
నైజాం
1.00 cr
సీడెడ్
0.27 cr
ఆంధ్ర(టోటల్)
0.60 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)
1.87 cr
‘కెప్టెన్ మిల్లర్'(తెలుగు) (Captain Miller) థియేట్రికల్ బిజినెస్ అడ్వాన్స్ లు అలాగే థియేటర్ రెంట్ల బేసిస్ పై రూ.1.87 కోట్ల వరకు ఉంది. సో బ్రేక్ ఈవెన్ కి రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. రిపబ్లిక్ డే హాలిడేతో పాటు శని, ఆదివారాలు కూడా కలిసొచ్చే అంశం ఉంది.