Captain Miller Collections: ‘కెప్టెన్ మిల్లర్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే..!

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller) తమిళంలో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. తెలుగులో మాత్రం థియేటర్స్ సమస్య ఉండటంతో కాస్త ఆలస్యంగా అంటే జనవరి 26న రిలీజ్ అవ్వడం జరిగింది. అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheswaran) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), అలాగే టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kisha)కూడా కీలక పాత్రలు చేయడం జరిగింది. ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్.

మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు..! ‘హనుమాన్’ (Hanau Man) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) వంటి సినిమాల హవా ఆ టైంకి ఇంకా ఉండటంతో ‘కెప్టెన్ మిల్లర్’ కి కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు.ఒకసారి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.20 cr
సీడెడ్  0.07 cr
ఆంధ్ర(టోటల్)  0.12 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)  0.39 cr

‘కెప్టెన్ మిల్లర్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్.. అడ్వాన్స్ లు అలాగే థియేటర్ రెంట్ల బేసిస్ పై రూ.1.87 కోట్ల వరకు ఉంది. సో బ్రేక్ ఈవెన్ కి రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్లో ఈ సినిమా కేవలం రూ.0.39 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ కి రూ.1.61 కోట్ల దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus