బిగ్ బాస్ హౌస్ లో చేపల చెరువు టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ అందరూ జంటలుగా విడిపోయి టాస్క్ ఆడుతున్నారు. ఇనయ – రేవంత్, శ్రీసత్య – శ్రీహాన్, ఫైమా – రాజ్, కీర్తి – రోహిత్, మెరీనా – బాలాదిత్య, ఆదిరెడ్డి – గీతు, సూర్య – వాసంతీలు జంటలుగా ఉన్నారు. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ అందరూ కొట్టుకుంటూ మరీ గేమ్ ఆడారు. ముఖ్యంగా గీతు అందర్నీ రెచ్చగొట్టింది. దీంతో మెరీనాకి గీతుకి గట్టి ఆర్గ్యూమెంట్ జరిగింది.
మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి గీతు – ఆదిరెడ్డి ఇద్దరూ కూడా గేమ్ నుంచీ తొలగిపోయారు. అందరికంటే తక్కువ చేపలు కలక్ట్ చేసిన కారణంగా ఈవారం కెప్టెన్సీ పోటీదారులుగా తొలిగిపోయారు. ఆ తర్వాత రౌండ్ లో సూర్య – వాసంతీ కూడా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచీ అవుట్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే, రోహిత్ అండ్ కీర్తి ఇద్దరూ కూడా తప్పుకున్నారు. ఇక మిగిలిన మూడు జంటలు కెప్టెన్సీ రేసులో నిలిచాయి. వారిలో రేవంతే – ఇనయ, ఫైమా – రాజ్, అలాగే శ్రీసత్య – శ్రీహాన్ ఉన్నారు.
రేవంత్ ఇనయ క్వాలిఫై ఎలా అయ్యారంటే., చేపల చెరువు టాస్క్ లో ఫస్ట్ నుంచీ కూడా రేవంత్ ఇంకా ఇనయ ఇద్దరూ కూడా ఎగ్రెసివ్ గా గేమ్ ఆడారు. రేవంత్ ఎక్కువ చేపలని కలక్ట్ చేశాడు. అందరికంటే ఎక్కువ రేవంత్ ఇంకా ఇనయల దగ్గర ఉన్నాయి. అలాగే, రాజ్ – పైమా ఒక ఛాలెంజ్ లో గెలిచి పది చేపలని పొందారు. అలాగే శ్రీహాన్ , శ్రీసత్య ఇద్దరూ కూడా చేపలని ప్రొటక్ట్ చేసుకుంటూ ఎక్కువ చేపలని కలక్ట్ చేశారు. దీంతో ఈ మూడు జంటలు క్వాలిఫై అయ్యాయి.
నిజానికి ఈవారం హౌస్ మొత్తం నామినేషన్స్ లో ఉంది. గతవారం కెప్టెన్ లేకుండానే ఇల్లు నడించింది. ఇప్పుడు కెప్టెన్సీ పోటీదారుల్లో ఈ జంటల్లో నుంచీ ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది మరి వీళ్లలో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది ఆసక్తికరం. ఇప్పటికే రేవంత్ కెప్టెన్ అయ్యాడు. రాజ్ కెప్టెన్ అయ్యాడు. ఇక మిగిలిన నలుగురికి అవకాశం రాలేదు. ఫైమా, శ్రీసత్య, శ్రీహాన్ ఇంకా ఇనయ వీళ్లలో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది చూడాలి. అలాగే, ఈవారం నామినేషన్స్ నుంచీ ఎవరు సేప్ అవుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అదీమేటర్.