Posani Krishna Murali: మరోసారి చిక్కుల్లో పడ్డ పోసాని కృష్ణమురళి!
- November 19, 2022 / 09:59 PM ISTByFilmy Focus
పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రైటర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆయన స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. ఈయన మాట తీరులానే కథలు కూడా విలక్షణంగా ఉంటాయి. పవిత్ర బంధం, గోకులంలో సీత, అల్లుడా మజాకా వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఈయన పనిచేశారు. త్రివిక్రమ్, కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్లు ఈయన శిష్యులే.నటుడిగా కూడా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు పోసాని.ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. మరోపక్క రాజకీయాల్లో పార్ట్ టైం వర్క్ చేస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు.
వైసిపి పార్టీకి అనుకూలంగా టీడీపీ, జనసేన పార్టీ ల పై ఈయన నోరుపారేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల పై సమయం దొరికినప్పుడల్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే ఈయన కొంప ముంచింది అని చెప్పాలి. గతంలో ఈయన పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన నేతల మనోభావాలను దెబ్బతీసింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది.

అయితే న్యాయస్థానం ముందుగా పోసాని పై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఐపిసి 354,355,500,504,506,507,509 సెక్షన్ల కింద పోసాని పై కేసు నమోదు చేశారు పవన్ అభిమానులు అలాగే జనసేన నేతలు. పోసాని కృష్ణమురళికి వివాదాలు కొత్త కాదు. మరి దీని పై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.












