సిద్దార్థ్ కు షాకిచ్చిన చెన్నై పోలీసులు..!

ప్రస్తుతం ఇండియా వైడ్ గా పౌరసత్వ సవరణ చట్ట (CAA – Citizenship Amendment Act) వ్యతిరేక ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయం పై కొందరు చెన్నై పోలీసులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన వారి పై కేసులు నమోదు చేస్తున్నారు. గురువారం నాడు చెన్నైలోని వల్లూవర్ కొట్టంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 600 మంది ఆందోళన చెపట్టారు. వీరందరి పై పోలీసులు కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది.

ఈ లిస్ట్ లో హీరో సిద్ధార్థ్ తో పాటు గాయకుడు టిఎం కృష్ణ, విసికె చీఫ్ థోల్ తిరుమావళవన్, వెల్ఫేర్ పార్టీకి చెందిన మొహమ్మద్ గౌస్ వంటి వారు ఉన్నారు. సెక్షన్ 143 విధించినప్పటికీ నిరసనలు తెలుపుతూ ఆందోళనకు దిగడంతో వీరి పై కేసు నమోదైంది. రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలతో సహా 38 గ్రూపులు నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోయినప్పటికీ.. ఇలా ఆందోళన చేపట్టినట్లు ఎఫ్ఐఆర్ లో పోలీసులు తెలిపారు.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus