తాజాగా బీజేపీ రాష్ట్ర నిర్వాహకురాలు మరియు ప్రముఖ నటి అయిన జయలక్ష్మి పై తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశం అయ్యింది.అందుతున్న సమాచారం ప్రకారం ఇరుగంబాక్కం, వెంకటేష్ నగర్‌లో నివసిస్తున్న లిరిసిస్ట్ స్నేహన్… 2015లో స్నేహం ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సేవా ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆయన. ఇదిలా ఉంటే… బీజేపీ నిర్వాహకురాలుగా నటి జయలక్ష్మి స్నేహం ట్రస్టు పేరుతో కోట్ల రూపాయలు వసూల్ చేస్తూ స్కామ్ చేసినట్టు స్నేహన్, నటి జై లక్ష్మీభాయి..
ఆగస్టు 5న చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. జయలక్ష్మీ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరారు. ఈ క్రమంలో స్నేహన్ ఫిర్యాదుని ఖండిస్తూ జయలక్ష్మీ ఆగస్టు 8న ఆమె కూడా ముందస్తు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో జయలక్ష్మీ పై హైకోర్టులో ఫిర్యాదు చేశారు స్నేహన్. ఈ విషయం పై హైకోర్టు అతనికి సానుకూలంగా స్పందించింది. నటి జయలక్ష్మి మోసానికి పాల్పడినట్టు ఆధారాలు లభిస్తే ఆమె కేసు పెట్టి అరెస్టు చేయాలని చెన్నై పోలీసులకు ఆర్డర్స్ పాస్ చేసింది.
ఈ క్రమంలో తిరుమంగళం పోలీసులు నటి జయలక్ష్మిపై 420, 465 సెక్షన్ కింద కేసు పెట్టి విచారణకు హాజరు కావాలని బుధవారం నాడు సమన్లు పంపారు.మరి ఈ విషయం పై జయలక్ష్మీ ఎలా రియాక్ట్ అవుతుంది, విచారణలో ఎలాంటి నిజాలు బయటపెడుతోంది? ఈమె వెనుక ఇంకెవరైనా ఉన్నారా? వంటి విషయాల పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.