Adipurush: ‘ఆదిపురుష్’ సినిమా పై కేసు నమోదు.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇది!

ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. అతని అభిమానులకు కూడా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని సినిమా ఉందా అంటే? తడుముకోకుండా చెప్పే పేరు ‘ఆదిపురుష్’. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి లీక్డ్ పిక్స్ చూస్తేనే వారికి సగం మైండ్ పోయింది. ఇక టీజర్ చూశాక.. ప్రభాస్ తో బొమ్మల సినిమా తీసావా అంటూ దర్శకుడు ఓం రౌత్ పై వారు మండిపడ్డారు. అంతేకాకుండా ఆ టీజర్ పై ట్రోలింగ్ కూడా ఓ రేంజ్లో జరిగింది. వి.ఎఫ్.ఎక్స్ కూడా చాలా నాసిరకంగా ఉందని అంతా తిట్టిపోశారు.

ఆ ట్రోలింగ్ చూసే బహుశా చిత్ర బృందం (Adipurush) కూడా సినిమాని పోస్ట్ పోన్ చేసింది. మళ్ళీ కొంత బడ్జెట్ పెట్టి.. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ బెటర్ గా చేయడానికి డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉండగా.. తాజాగా ‘ఆదిపురుష్’ సినిమా పై కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. విషయంలోకి వెళితే.. ఇటీవల శ్రీరామనవమి కానుకగా విడుదల చేసిన ‘ఆదిపురుష్’ స్పెషల్ పోస్టర్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపిస్తూ..

ముంబైలో ఉండే ప్రముఖ హిందూ ప్రవచన కర్త సంజయ్ దీనానాథ్ అక్కడి లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు లాయర్ల సాయంతో 295 ఎ, 298,500,34 సెక్షన్ల కింద ఆదిపురుష్ దర్శకుడు, నిర్మాతలపై కేసు నమోదు చేశారు.లేటెస్ట్ పోస్టర్ లో శ్రీరాముడికి జంధ్యం లేదని కూడా కంప్లైంట్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. దీనికి ప్రభాస్ అభిమానులు..’ ‘ఆదిపురుష్’ పై ఇంకో రెండు, మూడు కేసులు వేసి మరీ లేపండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంటే ‘ఆదిపురుష్’ పై హైప్ లేదు అని స్వయంగా అభిమానులే చెబుతున్నట్టన్న మాట.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus