ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం పెద్ద ధూమారాన్నే రేపింది చెప్పాలి. అతను సూసైడ్ చేసుకోవడంతో బాలీవుడ్ కు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఏకంగా సల్మాన్ ఖాన్, స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ల పై కూడా కేసు నమోదవ్వడానికి దారి తీసింది.పట్నాకు చెందిన సుశాంత్ సింగ్… డిప్రెషన్ కు లోనయ్యే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇన్వెస్టిగేషన్ లో రుజువయ్యింది. అసలు సుశాంత్ డిప్రెషన్ కు లోనవ్వడానికి కారణం.. బాలీవుడ్ సినీ పెద్దలేనంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది.
ఆరు నెలలగా సుశాంత్‌ను అనేక ప్రాజెక్టుల నుండీ తొలగించారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ బ్యాన్ చెయ్యాలని నెటిజన్లు పెద్ద ఎత్తున ‘#justiceforSushanthSinghRajput’ హ్యష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బిహార్‌లో కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్, ఏక్తా కపూర్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. సుధీర్ కుమార్ అనే న్యాయవాది వీరికి వ్యతిరేకంగా కేసు పెట్టాడు.
నిన్న(బుధవారం) మీడియాతో మాట్లాడిన సుధీర్ కుమార్.. ‘బిహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో ఐపీసీ సెక్షన్ 306, 109, 504, 506 కింద ఎనిమిది మంది పై కేసు పెట్టాను.హీరో సుశాంత్‌ను ఏడు సినిమాల నుండీ తీసేసారు అని కంప్లైంట్ లో రాసాను.అంతేకాదు సుశాంత్ నటించిన కొన్ని సినిమాల్ని కూడా విడుదల చెయ్యనివ్వలేదని కూడా ప్రస్తావించాను. ఇలాంటి పరిస్థితులే అతన్ని డిప్రెషన్ కు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేసాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.