ఒక చరిత్రకు సంబందించిన సినిమా తీస్తున్నారు అంటేనే.. ఆ చిత్రం పై చాలా వరకూ కాంట్రవర్సీలు వస్తుంటాయి. అలాంటిది ఇద్దరు గొప్ప వీరులు పై సినిమా తీస్తున్నారు అంటే.. ఇంకెన్ని కాంట్రవర్సీలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి కూడా అదే సమస్య వచ్చింది. తాజాగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ‘ఆర్.ఆర్.ఆర్’ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణంలో జిల్లాలోని పాండ్రంకిలో పుట్టి కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న బ్రిటీష్ సైనికులు జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందారని చెప్పారు. ఇక కొమరం భీమ్ 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని వీరభద్రరావు వివరించారు. అసలు వీరిద్దరికి స్నేహం ఎలా కుదిరింది. చరిత్రని వక్రీకరించడం తగదని ఆయన చెబుతున్నారు. నిజానికి ఈ విషయం రాజమౌళి ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. ఇది కేవలం కల్పితం. చరిత్ర సృష్టించిన ఇద్దరు సూపర్ స్టార్లు కలుసుకుంటే… ఎలా ఉంటుంది అనే పాయింట్ పైనే సినిమా ఉంటుందని .. ఎవ్వరినీ తక్కువ చేయడానికి కాదు అని రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. మళ్ళీ ఇలాంటి అభ్యంతరాలు రావడం కేవలం పబ్లిసిటీ కోసమేనేమో..! మరి ఈ విషయం పై రాజమౌళి స్పందిస్తాడో.. లేక లైట్ తీసుకుని తన పని తను చేసుకుంటూ పోతాడో చూడాలి…!
రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!