Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 11 శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మాదాపూర్‌లో రాత్రి 7.30 గంటల సమయంలో నటుడు తన స్పోర్ట్స్ బైక్‌పై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. సీసీటీవీ ఫుటేజీలో బైక్ అకస్మాత్తుగా రోడ్డుపై జారిపోయిందని, దాని కారణంగా సాయి రెండు మీటర్ల వరకు లాగబడ్డారని తేలింది.

బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం వలన తలకు పెద్ద గాయాలు కాలేదు. ప్రారంభంలో, నటుడిని మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను ఇంట్యూబేట్ చేయబడ్డాడు. తరువాత, అతడిని జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లకు తరలించారు. కొన్ని చోట్ల బలంగా గాయాలు అయినప్పటికీ సాయి క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే సాయి ధరమ్ తేజ్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

అసలైతే రోడ్డు మీద ఎక్కువగా ఇసుక ఉండడం వలన సాయి అదుపుతప్పి కిందపడిపోయాడని తెలుస్తోంది. ఇక నిర్లక్ష్యం, రాష్‌ డ్రైవింగ్‌ వలన ఐపీసీ 336 మోటార్‌ యాక్ట్ 184 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ అయితే ఓవర్ స్పీడ్ లో కూడా ఏమి లేడని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై మెగా హీరోలు స్పంధించాల్సి ఉంది. ఇక అతని ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తామని తాజా హెల్త్‌ బులెటిన్‌లో వైద్యులు వివరణ ఇచ్చారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus