మంచి ఛాన్స్ అందుకున్న కేథరిన్

  • September 27, 2018 / 01:41 PM IST

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన “అత్తారింటికి దారేది!” సూపర్ హిట్ అయింది. ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నారు . సుందర్.సి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పవన్ పాత్రను శింబూ చేస్తున్నాడు. తెలుగులో నదియా పోషించిన “సునంద”(అత్త) పాత్రని తమిళంలో కుష్బూ పోషించనున్నారు. అలాగే సమంత పాత్రలో మేఘ ఆకాశ్ నటించనుంది. ఇక ప్రణీత చేసిన పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా ? అని చిత్ర బృందం కొన్ని రోజులుగా వెతికింది. చివరికి ఈ పాత్ర కోసం కేథరిన్ ను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఇద్దరు అమ్మాయిలతో, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో కేథరిన్ తెలుగులో మంచి పేరుతెచ్చుకుంది.

అలాగే జయజానకి నాయకిలో కేథరిన్ స్పెషల్ సాంగ్ లో డాన్స్ ఇరగదీసింది. ఖైదీ నంబర్ 150 సినిమాలోనూ రత్తాలు సాంగ్ చేయాల్సింది. కానీ కాస్ట్యూమ్ విషయంలో గొడవలు రావడంతో పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత తెలుగు పరిశ్రమకి దూరమయింది. తమిళంలో రెండు సినిమాలు, మలయాళంలో ఒక సినిమా చేస్తోంది. తాజాగా “అత్తారింటికి దారేది!” రీమేక్ లో ఛాన్స్ అందుకుంది. ఈ రోల్ కేథరిన్ కి మంచి పేరు తీసుకొస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus