Manoj , Mounika: మనోజ్ పెళ్లికి హాజరైన సింగర్ సునీత దంపతులు!

మంచు మనోజ్ భూమా మౌనికల వివాహం శుక్రవారం సాయంత్రం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుక ఫిలింనగర్ లోని మంచు లక్ష్మి నివాసంలో అతి తక్కువ మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి మంచు కుటుంబ సభ్యులతో పాటు భూమా కుటుంబ సభ్యులు కూడా హాజరై సందడి చేశారు. ఇకపోతే మనోజ్ మౌనికల వివాహానికి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.

ఈ వివాహ వేడుకలో భాగంగా వైయస్ విజయమ్మతో పాటు శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలకు కూడా మనోజ్ వివాహ వేడుకలలో సందడి చేశారు. ఈ క్రమంలోనే మనోజ్ వివాహానికి సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, డైరెక్టర్ బాబి, బి ఎస్ రవి, వెన్నెల కిషోర్ వంటి పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరై సందడి చేశారు.

ఇకపోతే ఎప్పుడు బయట కనిపించనటువంటి సింగర్ సునీత దంపతులు తాజాగా మనోజ్ పెళ్లి వేడుకలలో సందడి చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సునీత తన భర్త రామ్ వీరపనేనితో కలిసి మనోజ్ పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. ఇలా పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ జంట నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఈ వివాహ వేడుక పూర్తి కాగానే తిరిగి బయటకు వెళ్తున్న సమయంలో రామ్ సునీత చేతినిపట్టుకొని వెళుతుండగా మీడియా వారి కోరిక మేరకు వీరిద్దరూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే సునీత సైతం రామ్ వీరపనేని రెండో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ వివాహం తర్వాత సునీత వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉండటమే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.



ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus